← Back to news

కూలిన బ్రిడ్జి.. కొత్త దారులు ఇవే!

By BK· 1d ago· భద్రాద్రి కొత్తగూడెం
కూలిన బ్రిడ్జి.. కొత్త దారులు ఇవే!

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ములకలపల్లి కంపగూడెం దగ్గర పాములేరు వాగు బ్రిడ్జి కూలిపోయింది. అశ్వారావుపేట MLA జారే ఆదినారాయణ అధికారులతో కలిసి స్పాట్‌ను పరిశీలించి ప్రత్యామ్నాయ రూట్లు అనౌన్స్ చేశారు. పాల్వంచ-దమ్మపేట భారీ వాహనాలను సత్తుపల్లి మీదుగా డైవర్ట్ చేశారు. కార్లు, బైక్‌లను మాదారం, అన్నపురెడ్డిపల్లి మీదుగా.. తిరుగు ప్రయాణంలో కంపగూడెం అడ్డరోడ్డు, తిమ్మంపేట మీదుగా మళ్లించారు. కొత్త బ్రిడ్జి కోసం 5 కోట్ల రూపాయిలు మంజూరు చేస్తామని MLA చెప్పారు.

More in Local