పేటెంట్ రూల్స్‌లో మార్పులు.. తగ్గనున్న మెడిసిన్స్ ధరలు?

మెడిసిన్స్ ధరలు తగ్గించేందుకు కేంద్రం పేటెంట్ రూల్స్‌ను స్ట్రిక్ట్ చేయాలని ప్రతిపాదించింది. ఇప్పటికే ఉన్న మెడిసిన్స్‌లో చిన్న మార్పులు చేసి పేటెంట్ గడువును పెంచుకునే కంపెనీలకు అడ్డుకట్ట వేయనుంది. కొత్త మెడిసిన్ వల్ల ఎక్కువ బెనిఫిట్ ఉందని కంపెనీలు ప్రూఫ్స్ చూపించాలి. పేటెంట్ గడువు ముగిశాక ఇతర కంపెనీలు తక్కువ ధరకు జనరిక్ మెడిసిన్స్ తయారు చేసి అమ్మవచ్చు. దీంతో ప్రజలకు తక్కువ ధరకు మెడిసిన్స్ అందే అవకాశం ఉంది.



