జీర్ణక్రియ మెరుగ్గా ఉండాలంటే ఈ అలవాట్లు తప్పనిసరి!

జీర్ణక్రియ సరిగా ఉంటే శరీరం ఆహారంలోని పోషకాలను బాగా గ్రహించగలుగుతుంది. ఒత్తిడి, తినే సమయం, ఆహారపు అలవాట్లు జీర్ణక్రియపై ప్రభావం చూపుతాయి. భోజనం చేసేటప్పుడు ప్రశాంతంగా ఉండటం, పడుకునే 2 గంటల ముందే రాత్రి భోజనం ముగించడం, ప్రతిరోజూ ఒకే సమయానికి తినడం, భోజనం తర్వాత 10 నిమిషాలు నడవడం, పప్పులు, ధాన్యాలను ఆహారంలో చేర్చుకోవడం జీర్ణక్రియకు సహాయపడతాయి. అయితే, ప్రతి ఒక్కరి శరీర పరిస్థితి వేర్వేరుగా ఉంటుంది.



