ఉపవాసంతో ఈ హెల్త్ ప్రాబ్లమ్స్ రావచ్చు.. జాగ్రత్త!

ఫాస్టింగ్ చేసేటప్పుడు ఆకలి వేయడం, కొంచెం నీరసంగా ఉండటం కామనే. కానీ మరీ ఎక్కువగా తల తిరగడం, తలనొప్పి, నీరసం ఉంటే మాత్రం అశ్రద్ధ చేయొద్దు. బాడీకి సరిపడా నీళ్లు, పోషకాలు అందకపోతే ఇలా జరగొచ్చు. అందుకే ఫాస్టింగ్కు ముందు మంచి ఫుడ్ తీసుకోవాలి. డయాబెటిస్ ఉన్నవాళ్లు, ప్రెగ్నెంట్ మహిళలు ఫాస్టింగ్ చేసే ముందు డాక్టర్ సలహా తీసుకోవాలి. మరీ ఎక్కువగా నీరసంగా అనిపిస్తే ఫాస్టింగ్ ఆపేసి వెంటనే డాక్టర్ను కలవడం మంచిది.



