చిన్నప్పటి ఫుడ్ హ్యాబిట్స్తోనే షుగర్ రిస్క్!

చిప్స్, బిస్కెట్లు, ఫాస్ట్ ఫుడ్ ఎక్కువగా తింటున్నారా? పిల్లల్లో ఈ అలవాట్లు ఫ్యూచర్లో షుగర్, అధిక బరువు సమస్యలకు దారితీయవచ్చని డాక్టర్ శశాంక్ జోషి హెచ్చరించారు. రోజూ బ్రేక్ఫాస్ట్, ఫ్రూట్స్, మిల్లెట్స్ తీసుకోవాలని సూచించారు. రోజుకు గంటసేపు ఆటలు ఆడటం, సరిపడా నిద్రపోవడం కూడా ముఖ్యమన్నారు. స్కూళ్లలోనే పిల్లలకు హెల్తీ ఫుడ్ హ్యాబిట్స్ నేర్పించాలని చెప్పారు. చిన్నప్పటి నుంచే మంచి అలవాట్లు ఉంటే ఫ్యూచర్లో ఆరోగ్య సమస్యల ముప్పును తగ్గించవచ్చని తెలిపారు.



