నడుస్తూ ఎర్రవెల్లికి..!
అసెంబ్లీ నుంచి ఎర్రవెల్లి ఫామ్‌హౌస్‌కి బయలుదేరిన కేటీఆర్, హరీశ్‌రావు ఇతర బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను బొల్లారం దగ్గర పోలీసులు అడ్డుకున్నారు. వారి వాహనాలు ముందుకు వెళ్లకుండా ఆపారు. కేటీఆర్, హరీశ్‌రావు నడక ప్రారంభించారు. ప్రస్తుతం హకీంపేట దాటారు. ORR వరకూ నడుస్తామంటున్నారు. అక్కడి నుంచి వాహనాల్లో వెళ్తామంటున్నారు. మరోవైపు బొల్లారం నుంచి సికింద్రాబాద్ వరకూ వాహనాల ట్రాఫిక్ జామ్ అయ్యింది. బొల్లారం నుంచి ఎర్రవెల్లికి 75 కిలోమీటర్లు.. దాంతో.. బీఆర్ఎస్ ఎమ్మెల్యేల నిర్ణయం పోలీసులకు టెన్షన్ తెప్పిస్తోంది.



