← Back to news

బొబ్బిలి MPDO ఆఫీసులోకి వరద నీరు

By DK· 7h ago
బొబ్బిలి MPDO ఆఫీసులోకి వరద నీరు

కురుస్తున్న భారీ వర్షాలకు విజయనగరం జిల్లా బొబ్బిలిలో ఎంపీడీవో కార్యాలయంలోకి వరద వచ్చి చేరింది. కార్యాలయ ఆవరణతో పాటు ఇంజనీరింగ్ విభాగం, వెలుగు ఆఫీస్, మండల వ్యవసాయశాఖ అధికారి కార్యాలయాల్లోకి మోకాళ్ల లోతు నీరు చేరింది. కంప్యూటర్లు, ఫైళ్లు, ఫర్నిచర్ తడిసిపోయాయి. నీరు చేరడంతో ఉద్యోగులు కుర్చీలపై కాళ్లు పెట్టుకుని విధులు నిర్వహించాల్సిన పరిస్థితి ఏర్పడింది. అధికారులు వెంటనే కార్యాలయాల్లోకి వచ్చిన వరద నీరు తొలగించేలా చర్యలు చేపట్టాలని సిబ్బంది కోరారు.

More in Local