విద్యుదాఘాతంతో భార్యాభర్తల మృతి

నల్గొండ జిల్లా దేవరకొండలో విషాద ఘటన చోటుచేసుకుంది. అంజయ్య కాలనీలో విద్యుదాఘాతానికి గురైన భార్యను కాపాడేందుకు ప్రయత్నించిన భర్త కూడా ప్రాణాలు కోల్పోయారు. మహ్మద్ దావుద్ మియా సోఫియా బేగం గాజులు విక్రయిస్తూ జీవిస్తున్నారు. తెల్లవారుజామున ఫ్యాన్ స్విచ్ వేస్తుండగా సోఫియాకు కరెంట్ షాక్ తగిలింది. ఆమెను కాపాడేందుకు వెళ్లిన దావుద్ కూడా విద్యుదాఘాతానికి గురయ్యారు. కుమారుడి సమాచారం మేరకు పోలీసులు కేసు నమోదు చేసి ఎంక్వైరీ చేస్తున్నారు.



