బాసర త్రిబుల్ ఐటీ.. ఫుడ్‌లో బొద్దింక

TG: నిర్మల్ జిల్లా బాసర త్రిబుల్ ఐటీ కళాశాలలో విద్యార్థులకు పెట్టిన ఫుడ్‌లో బొద్దింక రావడం తీవ్ర కలకలం రేపింది. E1-E2 మెస్‌లో చపాతీ ఆలూ కూర్మ వడ్డించగా బొద్దింక ప్రత్యక్షం కావడంతో విద్యార్థులు షాక్ అయ్యారు. డెయిలీ నాణ్యత లేని ఫుడ్ పెడుతున్నారంటూ స్టూడెంట్స్ ఆందోళన వ్యక్తం చేశారు. పలుమార్లు ఆకలిగా ఉన్నా పస్తులుంటున్నామని, డైలీ ఇలాంటి ఫుడ్ తినడం తమకు కామన్‌గా మారిందన్నారు. ప్రాథమిక విచారణ చేపట్టి నిజ నిర్ధరణ కోసం కమిటీని ఏర్పాటు చేసినట్లు యునివర్సిటీ అధికారులు తెలిపారు.



