చెట్టు కూలడంతో నిలిచిన రాకపోకలు

పార్వతీపురం మన్యం జిల్లా కురుపాం మండలం నీలకంఠాపురం సమీపంలో భారీ చెట్టు రోడ్డుకు అడ్డంగా కూలడంతో వాహన రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. శిరిడి సాయిబాబా ఆలయం వద్ద చెట్టు పడిన విషయం తెలియగానే SI పి. రమేష్ నాయుడు సిబ్బందితో అక్కడికి చేరుకున్నారు. చెట్లు కట్ చేసే యంత్రంతో చెట్టును ముక్కలుగా చేసి, పోలీసు సిబ్బంది, గ్రామస్తుల సహకారంతో రోడ్డు పక్కకు తరలించారు. దీంతో ట్రాఫిక్‌ను త్వరగా క్లియర్ చేసి వాహనాల రాకపోకలను పునరుద్ధరించారు.



