రోడ్డు మీద చెత్త వేయకండి మీ కాళ్లు మొక్కుతా..
హైదరాబాద్ గుడిమల్కాపూర్ డివిజన్‌లోని రామసింగపుర ప్రాంతంలో స్థానికులు ప్రతి రోజు రోడ్డు పక్కన చెత్త వేస్తున్నారు. అక్కడి నుంచి చెత్తను మున్సిపల్ సిబ్బంది రోజూ క్లియర్ చేసిన చెత్త పేరుకుపోతోంది. దీనికి శాశ్వత పరిష్కారం కోసం సూపర్‌వైజర్ మహేందర్ ఎర్లీ మార్నింగ్ అక్కడ నిలబడి చెత్త వేసే వారికి రోడ్డుపై చెత్త వేయొద్దని కాళ్లు మొక్కి మరీ విజ్ఞప్తి చేశాడు..



