← Back to news

మూడేళ్లలో అన్ని రంగాల్లోకి AI

By Anusha· 29 Sept 2026
మూడేళ్లలో అన్ని రంగాల్లోకి AI

వచ్చే మూడేళ్లలో AI వాడకం అన్ని రంగాలకూ విస్తరించనుందని వరల్డ్‌ ఎకనామిక్‌ ఫోరం రిపోర్ట్ తెలిపింది. అగ్రికల్చర్, ఎనర్జీ, మైనింగ్, కన్‌స్ట్రక్షన్ వంటి రంగాల్లో AIతో పనితీరు పెరగొచ్చని ఆర్థిక నిపుణులు అంచనా వేశారు. WEF సర్వేలో.. వచ్చే సంవత్సరం AI యూసేజ్ పెరుగుతుందని 97% మంది తెలిపారు. చైనా AI మోడళ్లు అమెరికా మోడళ్ల స్థాయికి చేరొచ్చని 69% మంది అభిప్రాయపడ్డారు. AI డేటా సెంటర్ల కోసం అణు, రిన్యూవబుల్ ఎనర్జీ ఇన్వెస్ట్‌మెంట్స్ కూడా పెరగనున్నాయి.

More in Technology