కంభంలో ఉచిత మెగా హెల్త్ క్యాంప్

మార్కాపురం జిల్లా కంభంలో ఈ నెల 27న ఉచిత మెగా హెల్త్ క్యాంప్ నిర్వహించనున్నారు. కంభం మెయిన్ రోడ్డులోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు శిబిరం కొనసాగుతుందని నిర్వాహకులు తెలిపారు. హకీమ్ మౌలానా షరీఫ్ హుస్సేని ఆధ్వర్యంలో నిర్వహించే ఈ క్యాంప్‌లో యునాని, ఆయుర్వేదం, ఆక్యుపంక్చర్, కప్పింగ్ థెరపీ తదితర పద్ధతులకు సంబంధించిన వైద్య సేవలు అందించనున్నట్లు పేర్కొన్నారు.



