పంతినిలో వర్ష బీభత్సం.. కూలిన ఇల్లు

హనుమకొండ జిల్లా ఐనవోలు మండలం పంతిని గ్రామంలో భారీ వర్షాలకు నస్కురి రాజేందర్‌కు చెందిన ఇల్లు కూలిపోయింది. రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలతో మట్టి గోడలు బలహీనపడి నిన్న అర్ధరాత్రి ఇల్లు పూర్తిగా నేలమట్టమైంది. ప్రమాద సమయంలో ఇంట్లో ఎవరూ లేకపోవడంతో ప్రాణనష్టం తప్పింది. అయితే ఇంట్లోని నిత్యావసర వస్తువులు, వంట సామగ్రి, బట్టలు ధ్వంసమయ్యాయి. అధికారులను, ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేయాలని గ్రామస్తులు విజ్ఞప్తి చేశారు.



