UPI ఛార్జీలపై సీపీఎం పోరు

ఖమ్మం జిల్లా సత్తుపల్లి మండల సీపీఎం కార్యకర్తల సమావేశం జరిగింది. జిల్లా కమిటీ సభ్యులు జాజిరి శ్రీనివాస్ మాట్లాడుతూ, యూపీఐ డిజిటల్ చెల్లింపులపై చార్జీల పేరుతో సామాన్య ప్రజలు, చిన్న వ్యాపారులపై అదనపు భారం మోపొద్దని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కూలీలు, రైతులు, చిరువ్యాపారులు, మధ్యతరగతి ప్రజలు యూపీఐపై ఆధారపడుతున్నారని తెలిపారు. ప్రజలపై భారం పడే విధానాలకు వ్యతిరేకంగా ఐక్య ఉద్యమాలు చేపట్టాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో కావూరి వెంకటేశ్వరరావు, లక్ష్మణ్, యాలాద్రి, జ్యోతి, రామకృష్ణ పాల్గొన్నారు.



