← Back to news

SFI సర్వేలో షాకింగ్ నిజాలు

By రవి· 19h ago· Alluri Sitharama Raju

'స్కూల్ బచావో' ప్రోగ్రామ్‌లో భాగంగా అల్లూరి జిల్లా ఏజెన్సీలోని ఆశ్రమ, గురుకుల పాఠశాలల్లో SFI నిర్వహించిన సర్వేలో దారుణ పరిస్థితులు బయటపడ్డాయి. కొయ్యూరు, చింతపల్లి, పాడేరు, జీ మాడుగుల ప్రాంతాల్లో హాస్టళ్లు లేక స్టూడెంట్స్ తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. జీ మాడుగుల GTWA బాయ్స్ స్కూల్లో వర్షం వస్తే విద్యార్థులు బురదలోనే పడుకునే పరిస్థితి ఉంది. ITDA ఉన్నా ఏజెన్సీ స్కూళ్ల పరిస్థితి మారలేదని, సమస్యలు తీర్చకపోతే పోరాటం తప్పదని SFI నాయకులు హెచ్చరించారు.

More in Local