బాలల సంక్షేమంపై బిగ్ రివ్యూ

గుంటూరు జిల్లా కలెక్టరేట్‌లో బాలల హక్కులు, సంక్షేమంపై సమీక్ష సమావేశం నిర్వహించారు. రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ చైర్మన్ ఎ.వి.ఎస్.ఎస్.ఎన్. రాజు, జాయింట్ కలెక్టర్ అశుతోష్ శ్రీవాస్తవ సంబంధిత శాఖల అధికారులతో సమావేశమయ్యారు. పిల్లలకు విద్య, వైద్యం, పోషకాహారం, భద్రత వంటి సదుపాయాలు అందించడం ప్రతి శాఖ బాధ్యత అని చైర్మన్ తెలిపారు. బాలకార్మిక వ్యవస్థ, బాల్యవివాహాలను అరికట్టాలని, డ్రాప్‌అవుట్ పిల్లలను తిరిగి పాఠశాలల్లో చేర్పించాలని సూచించారు.



