← Back to news

ములుగులో రోడ్డు ప్రమాదం

By BK· 2h ago· ములుగు
ములుగులో రోడ్డు ప్రమాదం

ములుగు జిల్లా తాడువాయి మండలం కొండపర్తి క్రాస్ వద్ద గుంటూరు వెళ్తున్న సూపర్ లగ్జరీ బస్సు, 26 మందితో వస్తున్న బొలెరో వాహనాన్ని ఢీకొట్టింది. ప్రమాదంలో గాయపడిన వారిని 108లో ములుగు గవర్నమెంట్ హాస్పిటల్‌కు తరలించారు. గాయపడినవారు మల్లంపల్లి మండలం ముద్దనూరు, సోమ్లా తండాకు చెందినవారు. ఘటనపై స్పందించిన మంత్రి సీతక్క ఆదేశాలతో జిల్లా గ్రంధాలయ చైర్మన్ బానోత్ రవిచందర్ హాస్పిటల్‌కు వెళ్లారు. మెరుగైన వైద్యం కోసం కొందరిని MGMకు తరలించగా, మిగతా వారికి ములుగులోనే ట్రీట్మెంట్ ఇస్తున్నారు.

More in Local