ఎల్‌నినో ఎఫెక్ట్.. పల్లెల్లో తాగునీటి కష్టాలు

సూర్యాపేట జిల్లాలో ఎల్‌నినో ప్రభావంతో వర్షాభావ పరిస్థితులు నెలకొనడంతో చెరువులు, కుంటలు ఎండిపోయి భూగర్భ జలాలు అడుగంటుతున్నాయి. నకిరేకల్, కేతేపల్లి మండలాల్లోని పలు గ్రామాల్లో తాగునీటి కష్టాలు తీవ్రమయ్యాయి. బోర్లలో నీరు తగ్గడంతో గ్రామాల్లో ట్యాంకర్ల ద్వారా నీటిని సరఫరా చేస్తున్నారు. నకిరేకల్ సబ్డివిజన్లోని 126 పంచాయతీల పరిధిలో నీటి సరఫరాకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి.



