గుండెకు స్టెంట్ ఎప్పుడు అవసరం?

గుండె రక్తనాళాల్లో బ్లాక్ ఉందని తెలిసినంత మాత్రాన స్టెంట్ వేయాల్సిన అవసరం లేదు. గుండెపోటు వచ్చినప్పుడు రక్తప్రసరణ ఆగిపోతే వెంటనే యాంజియోప్లాస్టీ చేసి స్టెంట్ వేయడం ప్రాణాలు కాపాడుతుంది. కానీ అన్ని బ్లాక్స్‌కు ఆపరేషన్ అవసరం ఉండదు. కొన్ని సందర్భాల్లో మందులు వాడుతూ, ఫుడ్, లైఫ్‌స్టైల్‌లో మార్పులు చేసుకుంటే సరిపోతుంది. బ్లాక్ ఎంత ఉంది, గుండెకు రక్తం సరిగ్గా అందుతోందా అనే విషయాలను చూసి డాక్టర్లు నిర్ణయం తీసుకుంటారు. బ్లాక్ ఉందని భయపడకుండా డాక్టర్ సలహా తీసుకోవాలి.



