జలపాతంతో సెల్ఫీ... ముగ్గురి బలి

అల్లూరి జిల్లా అనంతగిరి పాత మూలగుమ్మిలో సెల్ఫీ తీసుకుంటుండగా నలుగురు బాలికలు జలపాతంలో పడిపోయారు. ఈ ప్రమాదంలో ముగ్గురు బాలికలు మరణించారు. మరో బాలిక పరిస్థితి విషమంగా ఉండగా స్థానికులు ఆస్పత్రికి తరలించారు. మరణించిన వారు హుకుంపేట మండలంజుంబు వలసకు చెందిన వారని పోలీసులు తెలిపారు.


