'ఆరోగ్య పాఠశాల' హెల్త్ కార్డులు

జోగులాంబ గద్వాల జిల్లాలోని గవర్నమెంట్ స్కూల్ పిల్లల కోసం 'ఆరోగ్య పాఠశాల' పేరుతో స్టూడెంట్ హెల్త్ ప్రొఫైల్ కార్డులను అధికారులు ప్రారంభించారు. గద్వాల గవర్నమెంట్ స్కూల్లో అదనపు కలెక్టర్ నర్సింగరావు అతిథిగా హాజరై వీటిని పంపిణీ చేశారు. కలెక్టర్ ఆదేశాల మేరకు పిల్లలకు రకరకాల హెల్త్ చెకప్స్ చేసి, రిపోర్ట్స్‌ను కార్డులో నమోదు చేస్తామన్నారు. స్టూడెంట్స్ హెల్దీగా ఉంటేనే బాగా చదువుతారని చెప్పారు.



