← Back to news

పోక్సో చట్టంపై అవగాహన

By John mark Pjs· 21 Aug 2026· Anigandlapadu, Penuganchiprolu, Ntr
పోక్సో చట్టంపై అవగాహన

AP: NTR జిల్లా పెనుగంచిప్రోలు మండలం అనిగండ్లపాడులోని చైతన్య స్కూల్‌లో సైబర్ ఫ్రాడ్స్, ఆన్‌లైన్ మోసాలు, పోక్సో చట్టంపై విద్యార్థులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఎస్సై అర్జున్ మాట్లాడుతూ.. గుర్తుతెలియని ఫోన్ కాల్స్, మెసేజ్‌లు, అనుమానాస్పద లింకులకు స్పందించవద్దని సూచించారు. వ్యక్తిగత వివరాలు, బ్యాంకు సమాచారం, ఓటీపీ వంటి కీలక సమాచారాన్ని ఎవరితోనూ పంచుకోవద్దని వివరించారు. చిన్నారుల రక్షణ కోసం పోక్సో చట్టంలోని అంశాలను, బాలలపై జరిగే నేరాల నుంచి రక్షణ పొందేందుకు తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరించారు.

More in Local