← Back to news

తప్పిపోయిన బాలుడిని అప్పగించిన పోలీసులు

By DK· 1d ago
తప్పిపోయిన బాలుడిని అప్పగించిన పోలీసులు

అనంతపురం జిల్లా రాయదుర్గం పట్టణంలో తప్పిపోయిన ఆరేళ్ల బాలుడిని పోలీసులు చొరవ తీసుకుని తల్లిదండ్రులకు క్షేమంగా అప్పగించారు. చంద్రబాబునాయుడు కాలనీకి చెందిన సృజన్ రైల్వే స్టేషన్ సమీపంలో ఒంటరిగా తిరుగుతుండగా రైల్వే కార్మికులు గుర్తించి రాయదుర్గం పోలీస్ స్టేషన్‌కు తీసుకెళ్లారు. అర్బన్ CI దేవానంద్ బాలుడి తల్లిదండ్రుల కోసం సోషల్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా సమాచారం పంపించారు. దీంతో బాలుడి తల్లి, అమ్మమ్మ పోలీస్ స్టేషన్‌కు చేరుకున్నారు. వారిని విచారించిన అనంతరం బాలుడిని క్షేమంగా వారికి అప్పగించారు.

More in Local