← Back to news

దేశ ప్రతిష్ఠను దిగజార్చొద్దు:వెంకయ్య నాయుడు

By Sharmila· 2h ago
దేశ ప్రతిష్ఠను దిగజార్చొద్దు:వెంకయ్య నాయుడు

మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు కృష్ణా జిల్లా, ఆత్కూరులో స్వర్ణభారత్ ట్రస్ట్‌ నిర్వహించిన ప్రెస్ మీట్‌లో ప్రతిపక్షాల తీరుపై అసంతృప్తి వ్యక్తం చేశారు. ఎన్నికల్లో గెలిస్తే తమ ఘనతగా చెప్పుకోవడం, ఓడిపోతే EVMలను నిందించడం సరికాదన్నారు. రాజ్యాంగ సంస్థలపై ఆధారాలు లేని ఆరోపణలు చేయడం దేశ ప్రతిష్ఠకు నష్టం కలిగిస్తుందని అన్నారు. ప్రజాస్వామ్యంలో ప్రొటెస్టులు శాంతియుతంగా ఉండాలని సూచించారు. ప్రజల సంక్షేమానికి కృషి చేసిన నాయకులే చిరస్థాయిగా ఉంటారని చెప్పారు.

More in National