← Back to news

నల్లబజారు దోపిడీని అరికట్టండి: CPM

By malluru chandrashekar· 1h ago· Khammam
నల్లబజారు దోపిడీని అరికట్టండి: CPM

ఖమ్మం జిల్లా సత్తుపల్లి మండలం కాకర్లపల్లిలో బాల బుచ్చయ్య అధ్యక్షతన ఆదివారం రాత్రి సీపీఎం మండల కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా నాయకుడు జాజిరి శ్రీనివాస్ మాట్లాడుతూ.. నిత్యావసర వస్తువుల ధరల పెరుగుదలతో సామాన్య ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. ధరలను నియంత్రించి, రేషన్‌ షాపుల ద్వారా పేదలకు నాణ్యమైన సరుకులు అందించాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను డిమాండ్ చేశారు.

నల్లబజారు దోపిడీని అరికట్టండి: CPM

More in Local