ఢిల్లీలో భారీ అగ్ని ప్రమాదం.. ఇద్దరు మృతి?
Delhi స్వరూప్ నగర్‌లో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. ఇద్దరు సజీవ దహనం అయినట్లుగా తెలుస్తోంది. 3 అంతస్థుల భవనంలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. అవి చాలా త్వరగా పెద్దవయ్యాయి. వాటిని కంట్రోల్ చెయ్యడం కష్టంగా ఉంది. 15 ఫైరింజన్లతో సిబ్బంది రంగంలోకి దిగి ఫైర్‌ని కంట్రోల్ చెయ్యడానికి ప్రయత్నిస్తున్నారు. ఫైర్ యాక్సిడెంట్‌కి కచ్చితమైన కారణం ఇంకా తెలియలేదు. మంటలు పూర్తిగా కంట్రోల్ అయ్యాక, లోపల ఎవరైనా ఉన్నారా, చనిపోయారా అనే దానిపై క్లారిటీ వస్తుంది.


