ఆర్కే బీచ్‌లో రెస్క్యూ.. జీవీఎంసీ సాహసం
AP: విశాఖ RK బీచ్‌లో అలల ఉద్ధృతికి కొట్టుకుపోతున్న ఏలూరుకు చెందిన కుటుంబాన్ని జీవీఎంసీ స్విమ్మర్లు సాహసోపేతంగా రక్షించారు. సముద్రంలో చిక్కుకున్న వారిని గుర్తించి వెంటనే స్పందించిన స్విమ్మర్లు.. సురక్షితంగా ఒడ్డుకు చేర్చారు. సమయస్ఫూర్తితో ప్రాణాలు కాపాడిన వారిపై ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. సముద్రంలో అలల ఉద్ధృతి ఎక్కువగా ఉన్నప్పుడు నీటిలోకి దిగవద్దని అధికారులు పర్యాటకులకు ఎప్పటికప్పుడు సూచిస్తున్నారు.



