గణేశ్ మండపాలకు అలర్ట్!

TG: హైదరాబాద్ పరిధిలో ఏర్పాటుచేసే గణేశ్ మండపాల వివరాల్ని తప్పనిసరిగా ఆన్‌లైన్‌లో నమోదు చెయ్యాలని సీపీ సజ్జనార్ స్పష్టం చేశారు. పండుగ టైమ్ దగ్గర పడుతోందనీ, ఇంకా చాలా మంది నమోదు చేయించుకోలేదనీ, త్వరగా ఈ పని పూర్తి చేసుకోవాలని ఆయన కోరారు. నిర్వాహకులు <a href="https://policeportal.tspolice.gov.in/index.html">వెబ్‌సైట్‌లో</a> రిజిస్ట్రేషన్ చేసుకోవాలని సీపీ సూచించారు. నమోదైన వివరాల ఆధారంగా తగిన భద్రతా చర్యలు తీసుకుంటామనీ.. అలాగే.. నిమజ్జనం, ట్రాఫిక్ కంట్రోల్ కూడా ఈజీ అవుతుందని సజ్జనార్ తెలిపారు.



