రోడ్డుపై కూలిన భారీ చెట్టు

నెల్లూరు జిల్లా రాపూరు మండలం తూమాయి వద్ద పొదలకూరు–రాపూరు ప్రధాన రహదారిపై భారీ వృక్షం కూలి రోడ్డుకు అడ్డంగా పడింది. దీంతో వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడి ప్రయాణికులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. సమాచారం అందుకున్న రాపూరు ఎస్సై జె. తిరుమలరావు వెంటనే అక్కడికి చేరుకున్నారు. JCB సహాయంతో రోడ్డుపై పడిన చెట్టును తొలగించి ట్రాఫిక్‌ను క్లియర్ చేశారు. అనంతరం వాహనాల రాకపోకలకు ఇబ్బందులు లేకుండా చర్యలు చేపట్టారు.



