మార్కాపురం ఎస్పీగా పంకజ్ కుమార్ మీనా

మార్కాపురం జిల్లా ఎస్పీగా పంకజ్ కుమార్ మీనా గురువారం బాధ్యతలు స్వీకరించారు. అనంతరం పోలీసు అధికారులతో సమావేశమైన ఆయన జిల్లాలో శాంతిభద్రతల పరిస్థితిపై సమీక్ష నిర్వహించారు. భూ కబ్జాలు, గంజాయి అక్రమ రవాణా, ఇతర చట్టవ్యతిరేక కార్యకలాపాలపై ప్రత్యేక దృష్టి సారిస్తామని తెలిపారు. నేరాలకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. ప్రధాన భూ వివాదాల పరిష్కారం, మహిళల భద్రత, ట్రాఫిక్ సమస్యల నియంత్రణకు ప్రాధాన్యం ఇస్తామని చెప్పారు. క్రైమ్ నియంత్రణకు పటిష్ట చర్యలు చేపడతామని వెల్లడించారు.



