← Back to news

అక్షర కాలనీలో శరన్నవరాత్రి వేడుకలు.. మేయర్ పూజలు

By NRPT· 1h ago· Mahabubnagar
అక్షర కాలనీలో శరన్నవరాత్రి వేడుకలు.. మేయర్ పూజలు

మహబూబ్‌నగర్ జిల్లా అక్షర కాలనీలో శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా ఏర్పాటు చేసిన శ్రీ దుర్గాదేవి మండపంలో మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ గుమ్మల మమత శ్రీనివాస్ ముదిరాజ్ ప్రత్యేక పూజలు నిర్వహించారు. ప్రజలందరూ ఆయురారోగ్యాలతో, సుఖసంతోషాలతో జీవించాలని, రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని అమ్మవారిని ప్రార్థించినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో కాలనీ కమిటీ సభ్యులు, మహిళలు, భక్తులు, స్థానిక ప్రముఖులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

More in Local