ఉల్లి ధరలకు ఎల్‌నినో ఎఫెక్ట్.. సామాన్యుడికి షాక్

ఉల్లి ధరలు సామాన్యుడికి షాక్ ఇస్తున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో కిలో ఉల్లి ధర నెల క్రితం రూ.30–50 ఉండగా.. ఇప్పుడు రూ.70–80కి చేరింది. హైదరాబాద్‌లోని మలక్‌పేట హోల్‌సేల్ మార్కెట్‌లో క్వింటాల్ రూ.45 వేల నుంచి రూ.52 వేల వరకు పలుకుతోంది. మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాల నుంచి సప్లై తగ్గడం, వర్షాలతో పంట డ్యామేజ్ అవ్వడం వల్ల రేట్లు పెరిగినట్లు వ్యాపారులు చెబుతున్నారు. దీంతో వంటింటి బడ్జెట్‌పై ఉల్లి ధరల ఎఫెక్ట్ గట్టిగానే పడుతోంది. ఎల్‌నినో ఎఫెక్ట్‌తో ప్రొడక్షన్ తగ్గడం కూడా రేట్లు పెరగడానికి మరో కారణం.



