← Back to news

శ్రామికులకు వెల్డింగ్ మిషన్ల పంపిణీ

By epuri rajaratnam· 21 Aug 2026
శ్రామికులకు వెల్డింగ్ మిషన్ల పంపిణీ

AP: గుంటూరు జిల్లా మంగళగిరి మండలంలోని నూతక్కి, యర్రబాలెం గ్రామాలకు చెందిన శ్రామికులకు మంత్రి నారా లోకేశ్ సొంత నిధులతో వెల్డింగ్ మిషన్లను పంపిణీ చేశారు. నూతక్కికి చెందిన షేక్ మసూద్‌తో పాటు యర్రబాలెంకు చెందిన మిరియాల శేఖర్‌బాబు, ఉమ్మలేటి శ్రీకాంత్, షేక్ మొహమ్మద్ రసూల్‌కు పరికరాలను అందజేశారు. ఈ సందర్భంగా టీడీపీ మండల అధ్యక్షుడు పల్లబోతుల శ్రీనివాసరావు మాట్లాడుతూ.. శ్రామికులు ఇతరులపై ఆధారపడకుండా స్వయం ఉపాధి పొందుతూ ఆర్థికంగా అభివృద్ధి చెందాలనే ఉద్దేశంతో ఈ సహాయం అందించినట్లు తెలిపారు.

More in Local