← Back to news

పాఠశాలలో ఘనంగా బతుకమ్మ సంబరాలు

By Samrat Ashok· 1h ago· Nizamabad, Nizamabad South, Nizamabad
పాఠశాలలో ఘనంగా బతుకమ్మ సంబరాలు

నిజామాబాద్ జిల్లా మోర్తాడ్ మండలం పాలెం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఇవాళ బతుకమ్మ సంబరాలు ఘనంగా నిర్వహించారు. టీచర్లు త్రివేణి, రాజేశ్వరి, మమత, శ్రీవేణి, పద్మ విద్యార్థులతో కలిసి వివిధ రకాల పూలతో బతుకమ్మలను పేర్చి, సంప్రదాయ పాటలు పాడుతూ వేడుకల్లో పాల్గొన్నారు. విద్యార్థులు, మహిళా ఉపాధ్యాయినులను ప్రధానోపాధ్యాయుడు వేణుగోపాలరావుతో పాటు ఉపాధ్యాయులు అభినందించారు.

పాఠశాలలో ఘనంగా బతుకమ్మ సంబరాలు

More in Local