లక్ష్మీదేవిపల్లి రిజర్వాయర్‌ను కాపాడుకుందాం: జేఏసీ
దిండీ లిఫ్ట్ కారణంగా రంగారెడ్డి జిల్లా పరిధిలోని నగర్ నియోజకవర్గ పరిధిలోని లక్ష్మీదేవిపల్లి రిజర్వాయర్‌కు కలిగే నష్టాన్ని అడ్డుకోవాలని ఉమ్మడి పాలమూరు జిల్లా ప్రాజెక్టు సాధన కమిటీ జేఏసీ చైర్మన్ జి. రాజేందర్ రెడ్డి అన్నారు. జేఏసీ ఆధ్వర్యంలో షాద్‌నగర్ పెన్షనర్స్ భవనంలో చర్చ వేదిక ఏర్పాటు చేశారు. దిండీ లిఫ్ట్ కారణంగా ఉమ్మడి పాలమూరు జిల్లాకు రావాల్సిన నీళ్లు నల్లగొండ జిల్లాకు తరలిపోతాయని, ఇది రైతాంగానికి తీవ్ర నష్టం చేకూరుస్తుందని అన్నారు.



