ప్రజాస్వామ్యానికి ఇది చీకటి రోజు: Rana Ayyub
ఢిల్లీలో ప్రొటెస్ట్‌లపై పోలీసుల తీరును జర్నలిస్ట్ రాణా అయూబ్ తీవ్రంగా విమర్శించారు. ప్రొటెస్ట్‌కు వచ్చిన 15-16 ఏళ్ల పిల్లలను పోలీసులు తన కళ్ల ముందే ఈడ్చుకెళ్లారని ఆరోపించారు. రెచ్చగొట్టే నినాదాలు చేస్తున్న హిందూ జాతీయవాదులకు పోలీసులు రక్షణ కల్పిస్తున్నారని ఆమె అన్నారు. "నా 20 ఏళ్ల జర్నలిజం కెరీర్‌లో ఇలాంటి పరిస్థితి చూడలేదు, నిరసనను అణచివేయడం ప్రజాస్వామ్యానికి చీకటి రోజు" అని ఆమె విమర్శించారు. ఒక భారతీయురాలిగా నేను సిగ్గుపడుతున్నానని అన్నారు.

