"రిలీజ్ ఎప్పుడు?" నేహా బోరా ఫైర్

ఢిల్లీ పోలీసులు.. కొంతమంది యువ CJP లీడర్స్, జర్నలిస్టులను ఇంకా డిటెన్షన్ లోనే ఉంచడంపై AISA ప్రెసిడెంట్ నేహా బోరా ఫైర్ అయ్యారు. "శాంతియుతంగా ప్రొటెస్ట్ చేస్తుంటే ఎందుకు డిటైన్ చేశారు? ఎప్పుడు రిలీజ్ చేస్తారు?" అని ఆమె ప్రశ్నించారు. రాజ్యాంగాన్ని కాపాడాల్సిన వారే బాధ్యత మరిచారన్న ఆమె.. ప్రజలు నిలదీయాలని పిలుపిచ్చారు. ఇలాంటి ఘటనల్ని తేలిగ్గా తీసుకోకూడదనీ, ప్రజాస్వామ్యం కోసం తమ పోరాటం కొనసాగుతుందని నేహా స్పష్టం చేశారు.
