← Back to news

గోకవరంలో MPP పాలకవర్గ వీడ్కోలు సభ

By gani gani· 18h ago· Gokavaram, Gokavaram, East Godavari
గోకవరంలో MPP పాలకవర్గ వీడ్కోలు సభ

తూర్పు గోదావరి జిల్లా గోకవరం మండల పరిషత్ పాలకవర్గ వీడ్కోలు సభ గురువారం ఎంపీడీఓ గోవిందు ఆధ్వర్యంలో ఘనంగా జరిగింది. ఐదేళ్ల పదవీకాలం పూర్తి చేసుకున్న ఎంపీపీ సుంకర శ్రీవల్లి వీరబాబు, జెడ్పీటీసీ దాసరి శ్రీరంగతో పాటు ఇతర సభ్యులను ఘనంగా సత్కరించారు. సభ్యులు ఎంపీపీ పనితీరును ప్రశంసిస్తూ, పార్టీలకు అతీతంగా మండల అభివృద్ధికి కృషి చేశారని కొనియాడారు. తన పదవీకాలంలో సహకరించిన అధికారులు, ప్రజాప్రతినిధులు, ప్రజలకు ఎంపీపీ కృతజ్ఞతలు తెలిపారు.

More in Local