7 జిల్లాలకు అలర్ట్..!

ఆంధ్రప్రదేశ్‌లోని 7 జిల్లాలకు వాతావరణ శాఖ ఫ్లాష్‌ఫ్లడ్ (ఆకస్మిక వరదలు) అలర్ట్ జారీ చేసింది. అనకాపల్లి, విజయనగరం, విశాఖపట్నం, శ్రీకాకుళం, అల్లూరి, పార్వతీపురం, కాకినాడ జిల్లాల్లో వరదలు వచ్చే ఛాన్స్ ఉందని హెచ్చరించింది. గడిచిన 24 గంటల్లో విశాఖలో అత్యధికంగా 286mm, విజయనగరంలో 200mm వర్షపాతం నమోదైంది. మిగతా జిల్లాల్లోనూ భారీ వర్షాలు పడుతుండటంతో ప్రజలు అలర్ట్‌గా ఉండాలని అధికారులు చెబుతున్నారు.



