← Back to news

నల్గొండలో CM సభ.. టెన్షన్ టెన్షన్

By DK· 28 Jun 2026· నల్గొండ జిల్లా
నల్గొండలో CM సభ.. టెన్షన్ టెన్షన్

TG: నల్గొండలో CM రేవంత్ రెడ్డి సభ సందర్భంగా ఏర్పాటు చేసిన స్వాగత ప్లెక్సీల్లో DCC అధ్యక్షుడు పున్న కైలాష్ నేత ఫోటో లేకపోవడం వివాదానికి దారి తీసింది. అసలు CM సభకు తనకు ఆహ్వానమే లేదని కైలాష్ నేత అన్నారు. సభకు హాజరై తీరుతానని, ఎవరు అడ్డుకుంటారో చూస్తానని కైలాష్ నేత సవాల్ విసిరారు. దీంతో మరోసారి తెరపైకి DCC వర్సెస్ మినిస్టర్ పాలిటిక్స్‌లా మారింది. మరొవైపు సభలో మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డికి మంత్రి పదవిపై నిలదీస్తారన్న సమాచారంతో రాజ్ గోపాల్ రెడ్డి అనుచరులను పోలీసులు అరెస్ట్ చేస్తున్నారు.

More in Politics