← Back to news

iPhone 18 Pro వచ్చింది.. ధర మాత్రం గట్టిగానే ఉంది!

By Nani Garikina· 11 Sept 2026· Apple
iPhone 18 Pro వచ్చింది.. ధర మాత్రం గట్టిగానే ఉంది!

ఐఫోన్‌ 18 ప్రో కోసం వెయిట్‌ చేస్తున్నారా? ఈసారి ధర విషయంలో ఆపిల్‌ కాస్త షాక్‌ ఇచ్చింది. భారత్‌లో ఐఫోన్‌ 18 ప్రో 256GB ధర ₹1,64,900తో మొదలవుతోంది. గత ఏడాది ఐఫోన్‌ 17 ప్రో ప్రారంభ ధరతో పోలిస్తే ఇది ₹30,000 ఎక్కువ. 512GB ధర ₹1,89,900 కాగా, 1TB ₹2,39,900, 2TB ₹3,14,900గా ఉంది. పెరిగిన మెమరీ, స్టోరేజ్‌ చిప్‌ ఖర్చులు ధరలపై ప్రభావం చూపినట్టు రిపోర్టులు చెబుతున్నాయి. ప్రీ-ఆర్డర్లు సెప్టెంబర్‌ 12 నుంచి, అమ్మకాలు సెప్టెంబర్‌ 18 నుంచి మొదలవుతాయి. ఈసారి ఐఫోన్‌ ప్రో కొనాలంటే బడ్జెట్‌ పెంచాల్సిందే!

More in Technology