CJP అశుతోష్ రంకాని అడ్డుకున్న పోలీసులు
అసోం సీఎం హిమంత బిశ్వ శర్మ భయపడి పోలీసులను తమపైకి పంపుతున్నారని CJP కో-కన్వీనర్ అశుతోష్ రంకా ఆరోపించారు. గౌహతిలో స్వచ్ఛంద సేవకుల సమావేశానికి వెళ్తున్న రంకా, ఆయన బృందాన్ని అసోం పోలీసులు నిర్బంధించారు. వీడియోలో.. రంకా పోలీసు వెహికిల్ లోనే మాట్లాడారు. "స్కూల్స్ పరిస్థితి, కజిరంగాలో హక్కుల ఉల్లంఘన, భూములను కార్పొరేట్లకు అప్పగించడం వంటి నిజాలు బయటపడతాయని సీఎం భయపడుతున్నారు" అని ఆయన అన్నారు.



