ఫార్చూనర్లో వచ్చి రోడ్లు ఊడ్చుతున్న కార్మికుడు
కర్ణాటక దక్షిణకన్నడ జిల్లా బంట్వాళకు చెందిన శేషప్పణ్ణ అనే పారిశుధ్య కార్మికుడు రోజూ లగ్జరీ ఫార్చూనర్ కారులో వచ్చి రోడ్లు ఊడ్చడం వైరల్ అవుతోంది. 1996లో రూ.50 కూలీగా చేరి పర్మినెంట్ ఉద్యోగి అయిన ఆయన, ఆఫ్టర్‌నూన్ పశువుల పెంపకం ద్వారా నెలకు రూ.40వేలు సంపాదిస్తున్నారు. ఈ హార్డ్‌వర్క్‌తో ఆల్టో, స్కోర్పియోల నుంచి ఫార్చూనర్ కార్ దాకా కొనుగోలు చేశారు. గతంలో మద్యానికి బానిసనై ఎన్నో కోల్పోయానని, ఏ పని చేస్తున్నామనేది కాదని, గౌరవమే ముఖ్యమని శేషప్పణ్ణ చెప్తున్నారు.

