KGBVలో ఫుడ్ పాయిజన్.. 18 మంది ఆసుపత్రికి

TG: సిద్దిపేట జిల్లా మద్దూరు KGBVలో పలువురు విద్యార్థినులు ఒక్కసారిగా అస్వస్థతకు గురికావడం కలకలం రేపింది. మొత్తం 18 మంది విద్యార్థినులకు వాంతులు, ఇతర అనారోగ్య లక్షణాలు కనిపించడంతో వెంటనే చేర్యాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. వైద్యులు వారి పరిస్థితిని పర్యవేక్షిస్తూ చికిత్స అందిస్తున్నారు. ఇది ఫుడ్ పాయిజన్ వల్ల జరిగిందా? లేక ఇతర కారణాలున్నాయా? అనే విషయం వైద్య పరీక్షల అనంతరం తేలనుంది. విషయం తెలుసుకున్న అధికారులు, పోలీసులు ఆసుపత్రికి చేరుకుని విద్యార్థినుల ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు



