ప్రజావాణిలో 49 ఫిర్యాదులు.. కలెక్టర్ ఆదేశాలు!

వికారాబాద్ జిల్లా కలెక్టరేట్‌లోని ఐడీఓసీ సమావేశ మందిరంలో సోమవారం ప్రజావాణి జరిగింది. జిల్లా కలెక్టర్ దీపక్ తివారి ప్రజల నుంచి 49 ఫిర్యాదులు స్వీకరించారు. ఫిర్యాదుదారుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. దరఖాస్తులను పరిశీలించి తగిన చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. ప్రతి ఫిర్యాదుపై తీసుకున్న చర్యల వివరాలను సమర్పించాలని కోరారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ ఉమాశంకర్ ప్రసాద్, డీఆర్డీఓ శ్రీనివాస్, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.



