← Back to news

శ్రీశైలం ఘాట్ రోడ్డులో ప్రమాదం

By K.SAIDULU· 16 Aug 2026· Amrabad
శ్రీశైలం ఘాట్ రోడ్డులో ప్రమాదం

TG: శ్రీశైలం ఘాట్ రోడ్డులో బస్సు, కారు ఎదురుగా ఢీకొన్న ఘటనలో మహిళకు తీవ్ర గాయాలయ్యాయి. వనపర్తి జిల్లా గోపాల్ పేట గ్రామానికి చెందిన పార్వతమ్మ కుటుంబ సభ్యులతో కారులో శ్రీశైలం వెళ్ళి తిరిగి వస్తున్నారు. దోమలపెంట ఫారెస్ట్ రేంజ్ రాసమొల్లబావి టర్నింగ్‌లో శ్రీశైలం వెళ్తున్న ఆర్టీసీ బస్సు, కారు ఎదురెదురుగా ఢీకొన్నాయి. కారులో ఉన్న పార్వతమ్మ కాలికి తీవ్రంగా గాయమైంది. వైద్యం కోసం అచ్చంపేట ఆసుపత్రికి తరలించారు.

శ్రీశైలం ఘాట్ రోడ్డులో ప్రమాదం

More in Local