← Back to news

చెరువులో మొసలి.. గ్రామస్తుల్లో భయాందోళన

By Krishna· 2h ago· Nagarkurnool
చెరువులో మొసలి.. గ్రామస్తుల్లో భయాందోళన

నాగర్ కర్నూల్ జిల్లా బిజినపల్లి మండలం ఖానాపూర్ విలేజ్ చెరువులో ఆదివారం మొసలి కనిపించడంతో గ్రామస్తులు భయాందోళనకు గురయ్యారు. చెరువు దగ్గరికి వెళ్లాలంటే భయపడే పరిస్థితి వచ్చింది. ఈ విషయం తెలుసుకున్న సర్పంచ్, ప్రజలు ఎవరూ చెరువు వైపు వెళ్లొద్దని ఊరిలో దండోరా వేయించారు. ఫారెస్ట్ డిపార్ట్‌మెంట్ ఆఫీసర్స్ వెంటనే స్పందించి, ఆ మొసలిని అక్కడి నుంచి తరలించాలని గ్రామస్తులు కోరుతున్నారు.

More in Local