← Back to news

ఇళ్ల పక్కనే విద్యుత్‌ లైన్‌.. ప్రజావాణిలో ఫిర్యాదు

By vanjarapu Yellam· 1h ago· Masaipet, Masaipet, Medak
ఇళ్ల పక్కనే విద్యుత్‌ లైన్‌.. ప్రజావాణిలో ఫిర్యాదు

TG: ఇళ్లకు సమీపంలో 33 కేవీ విద్యుత్‌ లైన్‌ ఏర్పాటు చేయడంపై కాలనీవాసులు అభ్యంతరం వ్యక్తం చేశారు. మెదక్ జిల్లా మాసాయిపేట మండల కేంద్రంలో జాతీయ రహదారి 44 పక్కన ఉన్న సర్వీస్‌ రోడ్డులో 33 కేవీ లైన్‌ ఏర్పాటు చేస్తుండటంతో ప్రమాదాల ముప్పు ఉందని ప్రజావాణిలో ఫిర్యాదు చేశారు. దీంతో డీఈ దశరథ్‌, కన్స్ట్రక్షన్ ఏఈ, ఆపరేషన్ ఏఈ మనోహర్‌ కలిసి ఫీల్డ్‌ విజిట్‌ చేశారు. ప్రత్యామ్నాయ మార్గాన్ని ఎంచుకోవాలని కాలనీవాసులు డీఈని కోరారు. కార్యక్రమంలో సర్పంచ్‌ కృష్ణారెడ్డి, డైరెక్టర్‌ నరసింహులు, తదితరులు పాల్గొన్నారు.

ఇళ్ల పక్కనే విద్యుత్‌ లైన్‌.. ప్రజావాణిలో ఫిర్యాదు
ఇళ్ల పక్కనే విద్యుత్‌ లైన్‌.. ప్రజావాణిలో ఫిర్యాదు

More in Local