← Back to news

20 ఎకరాల మొక్కజొన్న పంట నష్టం.. వర్షం ఎఫెక్ట్!

By Mohan· 18h ago· Rajam, Rajam, Vizianagaram

విజయనగరం జిల్లా రాజాం మండలం లక్ష్మీపురం గ్రామంలో భారీ వర్షానికి 20 ఎకరాల్లో వేసిన మొక్కజొన్న పంట పూర్తిగా దెబ్బతింది. రైతులు కుదేలయ్యారు. పంట కోతకు వచ్చే సమయంలో కురిసిన అకాల వర్షం, ఈదురు గాలులకు పంట నేలకొరిగింది. పొలంలో నీరు నిలిచిపోవడంతో మొక్కలు కుళ్లిపోతున్నాయి. ఎకరాకు దాదాపు రూ.25 వేల పెట్టుబడి పెట్టామని, పంట మొత్తం పోయిందని, సుమారు రూ.5 లక్షల వరకు నష్టం వాటిల్లిందని రైతులు చెబుతున్నారు. ప్రభుత్వం స్పందించి నష్టపరిహారం అందించాలని కోరుతున్నారు.

More in Local